ఉత్తమ ఉపాధ్యాయుడెవరన్న దాన్ని వివరించాలనో
నిర్వచించి తీరాలనో నేనీ ప్రయత్నం చేయబోవడంలేదు.
వాళ్ళకు రాష్ట్రపతి పురస్కారాలకోసం సిఫార్సు చేయమనీ
ఎవరినీ అభ్యర్ధించడంలేదు.ఊరికే నాకు తెలిసినంతవిన్నంత
కన్నంతా మీకు పంచుకోవాలని ప్రయత్నమేతప్ప, ఇప్పుడు పురస్కారాలందుకున్న వారినీ వారిసామర్ధ్యాన్ని తక్కువచేయాలన్న తలంపూ నాకులేదు.
అప్పట్లొ తెనాలి దగ్గర సంగంజాగర్లమూడి జిల్లా పరిషద్ ఉన్నత పాఠ శాల ప్రధానోపాధ్యాయుడిగా కొత్త రాజ బాపయ్య గారు పనిచేసే వారు.పిల్లలను ప్రేమిస్తూనే వారి వ్యక్తిత్వాన్ని వారిలో
విలువలను పెంచడంలోనూ అశేషమైన కృషిజేసారు. పిల్లలకు పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తూపై అధికారులను పర్యవేక్షించమనీ అభ్యర్ధించేవారు.
అలాగే పిల్లలలో నిజాయితీ పెంచేదిశగా పోస్ట్ ఆఫీసులోలా కార్దులూ కవర్లూ పెట్టి నిజాయితీగా పిల్లలు ఆ సదుపాయాన్ని వాడుకునేలా ప్రయత్నించే వారు.ఎవరిచేతనయినా ఆ లెక్క చూడమనే వారు. ఒక్క పైసాకూ డా తేడా వచ్చిన సందర్భాలు రాలేదని చెప్పుకునే వారు.
క్లుప్తంగా వారి జీవిత విశేషాలు
--------------------------------
క్లుప్తంగా వారి జీవిత విశేషాలు
--------------------------------
1913-జులై ఒకటతేదీన-తెనాలితాలూకా జాగర్లమూడిలో జననం.
ప్రాధమిక విద్యా స్వగ్రామంలోని ప్రాధమికపాఠశాలలో.
ఉన్నత విద్య కొల్లూరు ఉన్నత పాఠశాలలో
తరువాత గుంటూరు ఏ సి.కలాశాలలో బీ. ఏ పట్టభద్రత
1937 లో బె ఈడి.
1937-38 లో రేపల్లెలో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయునిగా చేరారు.15 సంవత్సరాలపాటు,గణితశాస్త్రో పాధ్యాయునిగామరో 15 యేండ్లపాటు ప్రధానోపాధ్యాయునిగా.
వారు కూచిపూడి కోగంట్తి ఉన్నత పాఠశాప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న కాలంలో ఆయన లెక్కలు చెప్పే తీరు మరియూ క్రమ శిక్షణకు ముచ్చటపడిన విద్యార్ధులు బహు దూర ప్రాంతాలనుండి వచ్చి ఆయన దగ్గర చదువుకునే వారట.

No comments:
Post a Comment