Friday, April 3, 2015

ఆకలి ఆక్రందన
=================
ఆకలి కడుపుతోనే ఈ భూమ్మీదకు దిగబడ్దాను
ఎప్పుడూరుచికరమైన తిండిని తిన్న జాతకమే లేదు.
చిన్ని వసతితోనే అమ్మ బొజ్జలో సర్దుకుపోతూ పెరిగాను.
కడుపునిండా భోజనం చేసిన దాఖలా మాత్రం కనరాదు.

పిడచగట్టుకుపొయిన మెతుకులనే మృష్టాన్నమనుకుని తినిమురిసాను.

గ్రీష్మం అడుగుపెడుతుంటేనే
గుండెలో గుబులు మొదలవుతుంది.

నిరుడు నాసహోదరుడు ఈ ఋతువులోనే కన్నుమూసాడు.
ఆకలి బాధ తట్టుకోలేకనే అసువులు బాసుంటాడనుకున్నారు .

వచ్చే యేడాది నావంతు వస్తుందేమోననే
భయోత్పాతంతో వణికిపోతున్నాను.
పేదరికం పెద్దపీటవేసుకున్న కొద్దిపాటి పూరిపాక మాది
పేదరికంలో పుట్టి అందులోనే గిట్టడం మాయింట రివాజుగా మారింది.
=================================================

No comments:

Post a Comment